Monday, August 18, 2008

జాతక కధలు - కొన్దెగదు

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధదేశంలోని ఒక గ్రామంలో మాఘుడనే క్షత్రియ కుమారు డుగా జన్మించాడు.ఆ గ్రామంలో యూభై గడప ఉండేది. యూభై ఇళ్ళ మగవాళ్ళూ రచ్చపట్టులో సమావేశమవుతూండేవారు. ఈ గ్రామస్థులు నీతినియమాలు లేనివాళ్ళు. దొంగతనాలూ, హత్యలూ చేసి, లంచాలతో గ్రామాధికార్ల నోరు మూస్తూండే వాళ్ళు. ఈ రచ్చపట్టుకు ఆలనాపాలనా లేదు.
చెత్తా చెదారమూ ఉండేది. ఇది చూసి మాఘుడు తన కోసమని కొద్ది మేర శుభ్రం చేసుకు న్నాడు. కాని ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి స్వంతం చేసుకున్నారు. మాఘుడు మరొక జాగా శుభ్రం చేసుకు న్నాడు. దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించు కున్నారు. ఈ విధంగా మాఘుడు ఓపికతో రచ్చ పట్టంతా శుభ్రం చేశాడు. ఆ తరవాత అక్కడ నీడగా ఉండేటందుకు ఒక పందిరి వేశాడు. ఇందువల్ల గ్రామస్థులందరికీ చాలా సుఖం చేకూరింది.
మాఘుడి ప్రవర్తన యూభై ఇళ్ళ మగవారినీ ఆకర్షించింది. వారంతా అతని నాయకత్వం ఆమోదించి గ్రామసేవలో నిమగ్నులయ్యూరు. అందరూ కలిసి సమావేశాలకోసం ఒక పెద్ద మందిరం నిర్మించి, తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేశారు. అది మొదలు వారు మాఘుడి వద్ద పంచ శీలాలు నేర్చుకుని సద్వర్తనులై మెలగ సాగారు.
వారు రోజూ రహదారులు చదును చేసేవారు. వచ్చేపోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు. గుంటలు పూడ్చేవారు, చెరువులు తవ్వేవారు, తేమ ప్రదేశాల మధ్యగా నడిచేటందుకు ఎత్తయిన కట్టలు వేసేవారు. వారికి మాఘుడు మార్గదర్శీ, నాయకుడూ అయ్యూడు. ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు.
ఊళ్ళో వుండే యువకులు జూదరులుగా, హంతకులుగా, నీతిమాలి ప్రవర్తిస్తూ వున్న కాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగీ, లంచా లివ్వని వారికి జరిమా నాలు వేసీ, పుష్కలంగా సంపాదించాడు. కాని ఊరి కురవ్రాళ్ళకు మాఘుడు నాయకుడై, వారు సన్మార్గం అవలంబించిననాటి నుంచీ గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది. అందుచేత ఆ అధికారి రాజుగారి వద్దకు వెళ్ళి, ‘‘మహారాజా, మా గ్రామంలో అరాజకం బలిసిపోయింది.
మాఘుడనే వాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్త మానమూ కరల్రూ, గండ్రగొడ్డళ్ళూ, పలు గులూ పట్టుకు తిరుగుతున్నారు. ఏ రహ దారి మీద చూసినా వీళ్ళే. వీళ్ళ మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చి పడింది! ఏలినవారికి విన్నవించటం నా విధి! పైన తమ చిత్తం!'' అని ఫిర్యాదు చేశాడు. విషయం ఏమిటో తెలుసుకుని, అధి కారి చెప్పినది నిజమైతే గ్రామస్థులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంతమంది సైనిక భటులను పంపాడు.
వారు గ్రామంలోకి రాకముందే, మాఘుడూ అతని అనుచరులూ వారికి రహదారిపై కనిపించారు. ప్రతి ఒకరి చేతిలోనూ కర్రో, పలుగో, గొడ్డలో ఉన్నది. మారుమాట లేకుండా సైనికభటులు వారందరినీ పట్టు కుని, పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు.
రాజు వాళ్ళనూ, వాళ్ళ చేతుల్లో గల ఆయుధాలనూ చూసి, వాటిని వాళ్ళు గ్రామ సవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక, గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే ఎంచాడు. ఆయన వారిని విచారించకుం డానే, ‘‘ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గుల నందరినీ తొక్కించి చంపించండి!'' అని ఉత్తరు విచ్చాడు. మాఘుణ్ణీ, అతని అనుచరులనూ తొక్కించటానికి గాను పట్టపుటేనుగును ఆయత్తం చేసి తెచ్చారు.
అది వారికి కొంత దూరంలో ఆగి, బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది. మరొక ఏనుగును తెచ్చారు. అదీ అలాగే పారిపోయింది. ఈ వార్త రాజుకు అందింది. మూఢుడైన ఆ రాజు, ‘‘వాళ్ళ శరీరాల మీద తాయెత్తులూ, రక్షరేకులూ ఉండి ఉంటాయి. అందుకే ఏనుగులు వాళ్ళని సమీపించలేక పోయూయి. వాళ్ళని జాగ్రత్తగా పరీక్షించి అటువంటి వేవైనా ఉంటే విప్పి అవతల పారేసి, మళ్ళీ ఏనుగులను పంపండి!'' అని భటులను ఆజ్ఞాపించాడు.
కాని ఎవరి వంటి మీద కూడా ఒక తాయెత్తు కూడా లేదు. ఈ సంగతి విని రాజు, ‘‘ముద్దా యిలను నా వద్దకు పంపండి!'' అన్నాడు. మాఘుడు మొదలుగాగల యూభైమందీ రాజు ఎదుట హాజరయ్యూరు. ‘‘ఏనుగులు మిమ్మల్ని తొక్కటానికి ఎందుకు భయపడ్డాయి? మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు. నిజమేనా? మీకేమైనా మంత్రాలు వచ్చునా?'' అని రాజు వారిని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు మాఘుడు ఈ విధంగా సమా ధానం చెప్పాడు: ‘‘మీరన్నది నిజమే, మహారాజా! మా దగ్గిర గొప్ప మంత్రం ఉన్నది, దాన్ని మించిన మంత్రం ప్రపంచంలో మరి ఒకటి లేదు.'' ‘‘ఏమిటా మంత్రం?'' అని రాజు ఆత్రంగా అడిగాడు. ‘‘మాలో ఒక్కరు కూడా జీవహింస చెయ్యరు; ఒకరివ్వని వస్తువు తీసుకోరు, తప్పుడు ప్రవర్తనలకు దిగరు, అబద్ధాలాడరు; మేమెవరమూ మత్తు కలిగించే పదార్థాలు తాగము; మేము జీవులను ప్రేమిస్తాము; భూతదయ ఆచరిస్తాము; మేము దానాలు చేస్తాము, దారులు బాగు చేస్తాము, చెరు వులు తవ్వుతాము; సత్రాలు కడతాము.
ఇదే మా దగ్గిర ఉండే మంత్రం. ఇదే మా బలం,'' అన్నాడు మాఘుడు. ఇది విని రాజు నివ్వెరపోయి, ‘‘ఇదే మిటి? మీరు దారులు కాస్తారనీ, మీదగ్గిర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారనీ విన్నానే? అవేమీ నిజం కాదా?'' అన్నాడు. ‘‘మీరు ఇతరులు చెప్పినది విని నమ్మారు గాని, నిజానిజాలు విచారించ లేదు,'' అన్నాడు మాఘుడు. ‘‘మీరు ఆయుధాలతో మా భటు లకు దొరికారు. అందుచేత విచారించటం అనవసరమనిపించింది,'' అన్నాడు రాజు.
‘‘అవి మేము వినియోగించే సాధనాలు. రహదార్ల పక్కన ఉండే చెట్ల కొమ్మలు దారి కడ్డంగా ఉంటే, గొడ్డళ్ళతో నరుకుతాం. చెరు వులు తవ్వటానికీ, దారులు వెయ్యటానికీ, సత్రాలు కట్టటానికీ అవసరమైన పరికరాలు మా వెంట ఉంటాయి,'' అన్నాడు మాఘుడు. ఇంత అయ్యూక రాజు వారిని గురించి సరి అయిన విచారణ జరిపి, నిజం తెలుసుకు న్నాడు. గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధ మని రుజువయింది.
ఆ అధికారి ఎన్నో ఏళ్ళుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తునంతటినీ రాజు ఈ యువకుల పరంచేస్తూ, ‘‘ఇక నుంచీ మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి. నేను వేరే అధికారిని నియమించను,'' అన్నాడు. వారిని తొక్కించటానికి తెప్పించిన పట్ట పుటేనుగును కూడా ఆయన గ్రామస్థులకు కానుకగా ఇచ్చి పంపేశాడు.

No comments:

Powered By Blogger